బెంగళూరును చితక్కొట్టి.. 5 అవార్డులతో అదరగొట్టిన 'స్కై'
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో సూర్య కేవలం 35 బంతుల్లో 83 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇన్నింగ్స్‌లో సూర్య 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సహా మొత్తం 5 అవార్డులు లభించాయి.
మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు కొట్టినందుకు, మోస్ట్ వాల్యూబుల్ అసెట్ ఆఫ్ ది మ్యాచ్, డ్రీమ్ 11 గేమ్‌ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్, ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
ఈ అవార్డులన్నింటితో సూర్యకు మొత్తం రూ. 5 లక్షలు దక్కాయి. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించాడు.
అంతకుముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 82 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేశాడు.
దీంతో పాటు ఐపీఎల్‌లో సూర్య 100 సిక్సర్లు కూడా పూర్తి చేశాడు.