11 ఏళ్లు, జీరో విజయాలు.. రోహిత్ కెప్టెన్సీలో ముంబైకు పట్టిన తొలి విఘ్నం..
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ఓపెనింగ్ మ్యాచ్‌ను గెలవలేదు.
ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2012 సీజన్‌లో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో విజయం సాధించింది. వరుసగా 11 సీజన్లలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది.
చిన్నస్వామి స్టేడియంలో 2013లో RCB చేతిలో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2014లో అబుదాబి వేదికగా జరిగిన సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 41 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
గంభీర్ నేతృత్వంలోని KKR ఈడెన్ గార్డెన్స్‌లో 2015 IPL ఓపెనర్‌లో MIని 7 వికెట్ల తేడాతో ఓడించింది.
తమ తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ (RPSG) ముంబైని తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
స్టీవ్ స్మిత్ సారథ్యంలో RPSG 2017 తమ ప్రచారాన్ని ముంబైతో ప్రారంభించి, విజయం సాధించింది.
డ్వేన్ బ్రావో అద్భుత ఇన్నింగ్స్, కేదార్ జాదవ్‌ల ధాటికి CSK చేతిలో MI ఓటమిపాలైంది.
2019లో రిషబ్ పంత్ 18 బంతుల్లో 50 పరుగులు చేయడంతో వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఓడిపోయింది.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత జరిగిన మొదటి క్రికెట్ మ్యాచ్‌లో అబుదాబిలో CSK 5 వికెట్ల తేడాతో MIని ఓడించింది.
2021 సీజన్‌లో RCB చేతిలో MI ఓడిపోయింది.
2022 సీజన్‌లో DC చేతిలో ముంబై ఓటమిపాలైంది.
10 సంవత్సరాల తర్వాత మరోసారి ముంబై టీం RCB చేతిలో 9 వికెట్ల భారీ తేడాతో ఓడిపోయింది.