ఎలిమినేటర్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆకాష్ మధ్వల్.. తొలి బౌలర్‌గా రికార్డ్..

Akash Madhwal In IPL 2023:  లక్నో జట్టును ఓడించడంలో ముంబై ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మధ్వల్ కీలక పాత్ర పోషించాడు.

లక్నోతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆకాష్ పేరిట నమోదైన రికార్డులు ఇవే..

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆకాశ్ నిలిచాడు.

అనిల్ కుంబ్లే తర్వాత ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

ఆకాష్ 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, అనిల్ కుంబ్లే 3.1 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

చెన్నైలోని MA చిదంబరం (చెపాక్) స్టేడియంలో అత్యుత్తమ టీ20 బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ ఎకానమీ రేటుతో 5 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. లక్నోకు చెందిన ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోని, నికోలస్ పురాన్, రవి బిష్ణోయ్, మోహిసన్ ఖాన్‌ల వికెట్లను పడగొట్టాడు.

లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాశ్ కేవలం 1.40 పరుగుల ఎకానమీతో 3.3 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు.

IPL చరిత్రలో ఉమ్మడి నాలుగో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ బౌలర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ రికార్డు అల్జారీ జోసెఫ్‌ పేరిట నమోదైంది.

గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జోసెఫ్ 3.4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.