నవ్వించేందుకే జీవితం అన్నట్లు సాగారు హాస్య నటుడు ఎంఎస్ నారాయణ.

రచయితగా సినీరంగంలోకి వచ్చిన ఎమ్మెస్ నటుడిగా మారి తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరుగా మారారు. 

తాగుబోతు పాత్రలతో తనకంటూ ట్రెండ్ సెట్ చేసుకున్న ఎమ్మెస్ నారాయణ.

నవ్వడమే నా అలవాటు.. నవ్వించడమే నాకిష్టం అంటూ అలరించారు ఎమ్మెస్ నారాయణ.

1951 ఏప్రిల్ 16న జన్మించిన ఎమ్మెస్ నారాయణ..20 ఏళ్ళలో 700 చిత్రాల్లో నటించారు. 

ఈ రికార్డును గిన్నిస్ బుక్ గుర్తించినా, గుర్తించక పోయినా, తెలుగువారికి ఆయన పంచిన నవ్వులు గుర్తుంటాయి.

చదువుకొనే రోజుల నుంచీ ఎమ్మెస్ నవ్వులు పూయిస్తూ ఉండేవారు. తరువాత కలం పట్టి నాటకాలు రాశారు. 

వాటిలోనూ నవ్వులే అధికంగా పూయించారు. ఆ రచనలే చిత్రసీమలో ఎమ్మెస్ కు చోటు చూపించాయి.

ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన ‘మా నాన్నకి పెళ్ళి’ (1997) చిత్రంతో ఎమ్మెస్ కు నటుడిగా బ్రేక్ లభించింది. 

నారాయణ నవ్వుల నావ సజావుగా సాగుతున్న సమయంలోనే అనూహ్యంగా 2015 జనవరి 23న మునిగిపోయింది.