మహి తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్ లో చాలా సమయం గడుపుతాడు. ప్రత్యేక వర్కౌట్‌లతో పాటు తినే ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. ధోనీ ఏ డైట్ పాటిస్తాడో తెలుసా?
మహి ఉదయం పోషకాలతో కూడిన అల్పాహారంతో రోజు ప్రారంభిస్తాడు. అల్పాహారంగా సూప్, పండ్లు, మొలకలు, ఒక గ్లాసు పాలు తీసుకుంటాడు.
మహి ఇంటి వంటలనే ఇష్టంగా తింటాడు. కార్బోహైడ్రేట్, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉంటాడు. అన్నం, పప్పులు, కూరగాయలను తినే ఆహారంలో భాగం చేసుకుంటాడు.
డిన్నర్‌లో ధోనీ కూరగాయలు, సలాడ్‌లు, చపాతీలు తింటాడు. కొన్నిసార్లు మహి తనకిష్టమైన బటర్ చికెన్‌ని రాత్రిపూట కూడా తింటాడు.
శిక్షణ సమయంలో మాహి ప్రోటీన్ షేక్స్ ను తరచుగా తాగుతాడు. అంతే కాదు, ఫ్రూట్ జ్యూస్ ని కూడా తీసుకుంటాడు.
ధోనీ డైట్‌లో డీప్ ఫ్రైడ్ ఫుడ్‌కి స్థానం లేదు