బాలీవుడ్‌లో పెళ్లిల్ల సందడి ఇంకా కొనసాగుతోంది

కొత్త ఏడాది ప్రారంభంలోనే కేఎల్ రాహుల్- అతియాశెట్టి, కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటలు వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే

తాజాగా మరో బాలీవుడ్ నటి స్విని నిమేష్ ఖరా, తన ప్రియుడు ఉర్విశ్‌ దేశాయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు ప్రకటించింది

అమితాబ్-టబు నటించిన చిత్రం చీనీ కమ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్విని ఖరా పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది

స్వినీ ఖరా సోషల్ మీడియా ద్వారా తన నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది

అభిమానులతోపాటు సినీ ప్రముఖులు నూతన జంటకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు

ఎంఎస్ ధోని మువీలో ధోనీగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెల్లిగా జయంతి పాత్రను స్వినీ పోషించిన సంగతి తెలిసిందే