ధోనీ-ద్రవిడ్‌ సరసన సూర్యకుమార్.. తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన మిస్టర్ 360..

భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన బలమైన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

సూర్య తన ప్రతిభతో టీమ్ ఇండియాలోనూ స్థానం సంపాదించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచాడు.

దీంతో పాటు వన్డేల్లోనూ తన సత్తా చాటాడు. సూర్యకి 2022 చాలా బాగా కలిసివచ్చింది.

దీంతో ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేసింది.

ఈ అవార్డు అందుకోగానే సూర్యకుమార్ చరిత్ర సృష్టించాడు.

టీ20లో ఈ అవార్డు అందుకున్న తొలి భారత ఆటగాడు.

ICC పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన తొలి భారతీయ ఆటగాడు.

దీంతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్‌ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

టెస్టు ఫార్మాట్‌లో ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ ఆటగాడు ద్రవిడ్.

మరోవైపు వన్డే ఫార్మాట్‌లో ఈ అవార్డును అందుకున్న తొలి భారత ఆటగాడు ధోనీ.

2008లో ధోనీ ఈ అవార్డును అందుకున్నాడు. కాగా 2004లో ద్రవిడ్ ఈ టైటిల్‌ను అందుకున్నాడు.