సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన భామ మృణాల్ ఠాకూర్.
ప్రస్తుతం నానికి జోడిగా ఓ చిత్రంలో నటిస్తుంది ఈ బ్యూటీ.
కాగా మరో క్రేజీ తెలుగు హీరో సరసన నటించనున్నట్లు సమాచారం.
ఆ హీరో ఎవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
కథా నచ్చడంతో మృణాల్ ఈ చిత్రానికి పచ్చ జండా ఊపిందని తెలిసింది.
ఈ చిత్రం ‘గీత గోవిందం’ లాంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని వారంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి మొదలుకానుంది.
ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.