మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన సినిమా ‘సీతా రామం’.
‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది.
అన్ని వర్గాలను అలరించిన ఈ చిత్రం సీక్వెల్ కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.
ఆమె నటించిన ఒక బాలీవుడ్ చిత్రం విడుదలైన సందర్భంగా మృణాల్ అభిమానులతో ముచ్చటించారు.
ఆ చిట్‌చాట్‌లో ఓ అభిమాని ‘సీతా రామం-2’ ఉంటుందా అని మృణాల్‌ను అడిగారు.
ఆ ప్రశ్నకు మృణాల్ స్పందిస్తూ.. ‘‘సీతారామం’ నిజంగా అద్భుతమైన చిత్రం.
ఈ సినిమా సీక్వెల్ గురించి నాకు ఇంత వరకు సమాచారం తెలియదు. కానీ, పార్ట్-2 కోసం ఎదురుచూస్తున్నాను’’ అని సమాధానం చెప్పారు.