మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.
నార్త్ ఇండియన్ అమ్మాయి అయినా.. అచ్చం తెలుగమ్మాయిగా కనిపించి మెప్పించింది. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న మృణాల్.. ప్రేమ, పెళ్లి, వయసు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సాధారణంగా తన వయస్సు ఎంత ? అని ప్రజలు తనను అడుగుతారని.. తన వయసు 30 ఏళ్లు అని చెప్పగానే వెంటనే పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తారని చెప్పుకొచ్చింది.
నువ్వు పెళ్లి చేసుకోవాలి.. వివాహం గురించి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? నీకు 32 ఏళ్లు వచ్చేసరికి పిల్లలు పుడతారా ?
అని ప్రశ్నిస్తారని.. దీంతో వారి నుంచి దూరంగా వచ్చేనని తెలిపింది మృణాల్.
ఆ వయసులో ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే.. మనం కూడా ప్రేమిస్తామని.. కానీ 30 ఏళ్ల వయసులో ఆ వ్యక్తిని నేను ఎక్కువగా ప్రేమించాలని.