ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకుంది అందాల తార మృణాల్‌ ఠాకూర్‌.

సీతారామమ్‌ సినిమాలో సీతా పాత్రలో మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా సౌత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.

సీతా రామమ్‌ సినిమా విడుదల తర్వాత మృణాల్‌కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

సీత పాత్రలో సంప్రదాయంగా కనిపించిన మృణాల్‌ ఇటీవల పలు హాట్‌ హాట్‌ ఫొటోషూట్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాల గురించి వివరించిన ఈ బ్యూటీ.. తనకు ఆటలు అంటే చాలా ఇష్టమని తెలిపింది.

క్రికెట్, బాస్కెట్‌ బాల్‌ ఆడే అలవాటున్న మృణాల్‌.. జోనల్‌ మ్యాచ్‌లో కూడా తన సత్తా చాటిందని చెప్పుకొచ్చింది.

తనకు చిన్నప్పుడు హృతిక్‌రోషన్‌, షాహిద్‌కపూర్‌ ఫొటోల్ని చించి పుస్తకాల్లో పెట్టుకుని చూసుకునేదాన్నని..

వాళ్లతో నటించే అవకాశం వస్తే ఎగిరిగంతేశాని మనసులో మాట బయటపెట్టింది.కలలు లేని జీవితం వ్యర్థమని నమ్మే ఈ అందాల రాశి.