బుల్లితెరపై సహయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది.

ఆ తర్వాత మరాఠీలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. హిందీలో సూపర్ 30 సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఇక ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈసినిమా భారీ విజయంతోపాటు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మృణాల్ అందం..

అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం సీతారామం తర్వాత ఈ బ్యూటీకి భారీగానే ఆఫర్స్ వస్తున్నాయట. ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదట.

అందుకు కారణం మృణాల్ రెమ్యూనరేషన్ పెంచడమే. సీతారామం హిట్ తర్వాత మృణాల్ మరో సినిమాకు సైన్ చేయలేదని..

తాను తన తదుపరి ప్రాజెక్ట్స్ కోసం రూ. కోటి వసూలు చేయాలని భావిస్తున్నారట. అలాగే తన నెక్ట్స్ మూవీస్ విషయంలో మృణాల్ అచి తూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.