‘సీతా రామం’తో అందరి మనసుల్లో చెదరని ముద్ర వేసుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
ఈ సినిమా తర్వాత మంచి చిత్రాలను ఎంపిక చేసుకొని నటిస్తోంది.
ఈ అమ్మడు నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘గుమరాహ్’.
ఇందులో మృణాల్ పోలీస్ పాత్రలో అలరించనుంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ‘సీతా రామం’ తనపై ఎంత ప్రభావం చూపిందో చెప్పింది.
అలానే నాచురల్ స్టార్ నానితో చేయనున్న సినిమా స్క్రిప్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నాని 30 (Nani30)వ సినిమా గురించి మాట్లాడుతూ తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్‌ను ఇప్పటి వరకు చదవలేదని చెప్పింది.
ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి కాగ.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని.. సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది.