చిత్రసీమలో ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ అనగానే చాల మంది దూరంగా ఉంటారు
మృణాల్ ఠాకూర్ మాత్రం పూర్తిగా ప్రయోగాలతోనే ఈ ఏడాది ప్రయాణం అంటోంది
‘సీతారామం’ సినిమాతో సీతామహాలక్ష్మిగా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొంది
ఆ తర్వాత కాస్త ఆలస్యమైనా ఆమె ఆచితూచి నానితో సినిమాకి ఓకే చెపింది
ఇదిలా ఉండగా ఆమె ప్రయోగాల గురించి కొన్ని విషయాలు వెల్లడించింది
మృణాల్ ప్రయోగాల విషయమై మాట్లాడుతూ ‘‘ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడమే నాకు తెలుసు. అందరికీ సాహసం చేస్తున్నట్టు అనిపించొచ్చేమో కానీ, నాకు మాత్రం సవాల్‌గా అనిపించేది అలాంటి ప్రయత్నాలు చేసినప్పుడే. సవాళ్లని స్వీకరించడంలోనే అసలు మజా’’ అని పేర్కొంది
ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల చిత్రీకరణలో ఉండగా సినిమాల్ని మరో రెండు మూవీస్ మృణాల్ పూర్తి చేసింది