సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది అందాల భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాలూ సీతామహాలక్ష్మీ గా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది.
అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసింది. ఇదిలా ఉంటే మృణాల్ అంత ఈజీగా హీరోయిన్ అవ్వలేదు. చాలా స్ట్రగుల్స్ పడిందట.
అయితే ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్.హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది.
అయితే హీరోయిన్ గా ఈ చిన్నది మొదటి సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం దక్కించుకుందట. కానీ ఆ సినిమాలో నటించలేకపోయిందట.
సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ సినిమాలో ముందుగా మృణాల్‌ను హీరోయిన్ గా అనుకున్నారట. ఈ సినిమా కోసం ఫైటింగ్ లో కూడా శిక్షణ తీసుకుందట.
అలాగే 11 కిలోల బరువు కూడా తగ్గిందట. అయితే ఆ తర్వాత ఆమెను కాదని అనుష్క శర్మను ఈ సినిమాలోకి తీసుకున్నారట.
ఆ తర్వాత లవ్ సోనియా’ అనే సినిమా ఆడిషన్ కు వెళ్లిందట మృణాల్. అయితే ఈ సినిమాలో అక్రమ రవాణాకి బలైన చెల్లిని కాపాడుకునే అక్కగా కనిపించింది మృణాల్.
ఈ సినిమా కోసం కోల్‌కతాలోని ఓ వేశ్యా గృహంలో రెండువారాలు ఉందట మృణాల్. అక్కడ వాళ్ళతో గడిపి వారి కథలు విని చెలించిపోయిందట..