‘సీతారామం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది మృణాల్‌ ఠాకూర్‌

ఈ చిత్రంలో సీతామహాలక్ష్మీగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది మృణాల్‌

ఈమె ప్రస్తుతం ఆదిత్యరాయ్‌ కపూర్‌ సరసన ‘గుమ్‌రాహ్‌’ చిత్రంలో నటిస్తున్నారు

వర్ధన్‌ కేట్కర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌ ఆకట్టుకునేలా సాగింది

మర్డర్‌ మిస్టరీని చేధించే పోలీస్‌ అధికారిగా ఈ చిత్రంలో నటిస్తోంది మృణాల్‌

ఏప్రిల్‌ 7న విడుదల కానున్న ఈ చిత్రం తమిళ చిత్రం ‘తడమ్‌’కు హిందీ రీమేక్‌

ప్రస్తుతం తెలుగులో నానికి జోడిగా ఓ మూవీలో మృణాల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే

దీంతో పాటు మరికొన్ని తమిళ, తెలుగు చిత్రాలలో నటించేందుకు కథా చర్చలు జరుగుతున్నాయి