అప్పట్లో ఏదైనా పండగ లేదా హీరోల పుట్టినరోజు పురస్కరించుకొని వాళ్లు నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రీ-రిలీజ్‌ చేసేవారు.

ఆ ట్రెండ్ ఇటీవల మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే.

అయితే పాత చిత్రాలను 4కేకి అప్‌గ్రేడ్‌ చేసి మరీ విడుదల చేస్తున్నారు.

మహా అయితే ఒక చిత్రాన్ని మూడుసార్లు రీ-రిలీజ్‌ చేస్తారు.

కానీ, ఒక చిత్రాన్ని ఏకంగా 550 సార్లు రీరిలీజ్‌ చేశారు.

అదే ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ఓం’.

ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్‌కు జోడిగా ప్రేమ నటించింది.

1995 మే 19న విడుదలైన ఈ చిత్రం ఈ రోజుకి 28 ఏళ్ళు పూర్తి చేసుకున్నా ఈ చిత్రం కన్నడనాట సంచలనం సృష్టించింది.

అప్పటి నుంచి మార్చి 12, 2015 వరకూ ఈ చిత్రాన్ని ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్‌ చేశారు.

దింతో అత్యధికసార్లు రీరిలీజ్‌ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది ఈ చిత్రం.