చైనీస్ వంటకాలు ఆ దేశ సంస్కృతి వలె విభిన్నంగా ఉంటాయి. ప్రతి ప్రాంతానికి ఓ ప్రత్యేకమైన మెను ఉంటుంది. వంటల శైలి, పదార్థాలు, రుచులు కూడా ఎంతో ప్రత్యేకంగా, రుచిగా ఉంటాయి. అత్యంత ప్రఖ్యాతిగాంచిన  చైనీస్ వంటకాలు కొన్నింటిని తెలుసుకుందాం.

డిమ్ సమ్స్ నార్త్ ఇండియాలో ఎక్కవ జనాదరణ పొందిన, ఎక్కువ మంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్స్‌లో ఒకటి. నాన్ వెజ్ ఐటమ్ అయిన  దీనిని మాంసంతో పాటు కొన్ని రకాల కూరగాయల మిశ్రమంతో తయారుచేస్తారు.

హాట్ అండ్ సోర్ సూప్ శీతాకాలంలో ఈ సూప్ ఎక్కువుగా తాగుతుంటారు. చాలా రెస్టారెంట్లలో ఈ సూప్ అందుబాటులో ఉంటుంది.  స్పైసీగా, వేడిగా ఈ రెసిపిని తీసుకుంటే భోజన ప్రియులు నిజంగా ఎంజాయ్ చేస్తారు.

 స్ప్రింగ్ రోల్స్ పార్టీల సమయంలో ఈ డిష్‌ను ఎక్కువుగా వడ్డీస్తారు. ముందుగా గోధుమపిండితో చేసుకున్న రోటీలో  తురిమిన కూరగాయలు  డీప్ ఫ్రై చేసిన మిశ్రమాన్ని కలిపి రోల్‌గా చుడతారు. యూత్ ఎక్కువుగా ఇష్టపడే రెసిపీలలో ఇదొకటి.

చిల్లీ పొటాటో నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడే చైనీస్ ఫుడ్‌లో  చిల్లీ పొటాటో ఒకటి. చైనీస్ ఫుడ్ లభించే అన్నిచోట్ల విరివిగా దొరికే డిష్. బంగాళదుంపలు, కొన్ని రకాల సాస్‌లు, మసలా దినుసులు ఉపయోగించి దీనిని తయారుచేస్తారు.

 నూడుల్స్ ఎక్కువమంది పిల్లలు ఇష్టపడే చైనీస్ ఫుడ్‌లో నూడుల్స్ ముందువరుసలో ఉంటుంది. ఇంట్లో కూడా చాలామంది తయూరుచేసుకునే వంటకాల్లో ఇదొకటి. ప్రస్తుతం నూడిల్స్‌ను రకరకాల కూరగాయలు మిక్స్ చేసి  వండుకుంటుంటారు.

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవడానికి అద్భుతమైన మార్గం వెజ్ ఫ్రైడ్ రైస్. క్యారెట్, క్యాబేజీ, బీన్స్‌తో పాటు బేబీ కార్న్, సోయా సాస్, మిరపకాయలు, వెల్లులి వంటివి జోడించి రైస్ ను ఫ్రై చేసే సమయంలో ఈ కూరగాయల మిశ్రమాన్ని కలిపి చేసుకోవచ్చు.