విశాల్ ..! పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా.. టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించారు.
తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కాని రీసెంట్ డేస్లో కాస్త సినిమాలను తగ్గించి పొలిటికల్ వైపు టర్న్ తీసుకుంటున్నారు.
కోలీవుడ్ ఫిల్మ్ సొసైటీ.. నడిగర్ సంఘం ఎలక్షన్ లో కీ రోల్ పోషించారు. జనరల్ సెక్రెటరీ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
దాంతో పాటు.. తాజాగా సినిమాలు చేయడం కూడా మొదలెట్టారు. రీసెంట్ గా ఎనిమీ.. సామాన్యుడు సినిమాలతో దిమ్మతిరిగే హిట్లు కూడా కొట్టారు.
కెరీర్ పరంగా ఇలా దూసుకుపోతున్నా కూడా.. పర్సనల్ గా ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నారు.
ఇక ఇదే కామెంట్‌ను ఆయన పేరెంట్స్ తో పాటు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు.