2,2,W,W,W,W.. చివరి ఓవర్లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన షమీ..

ICC T20 వరల్డ్ కప్-2022 లో తమ మొదటి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది.

గబ్బా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ మ్యాచ్ ఫలితం చివరి ఓవర్లో, చివరి బంతికి తేలింది. మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి విజయాన్ని అందించాడు.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చివరి ఓవర్‌లోనే షమీని బౌలింగ్‌లోకి తీసుకున్నాడు.

తొలి బంతికి కమిన్స్ 2, రెండో బంతికి 2 పరుగులు చేశాడు.

ఆ తర్వాత మూడో బంతికే కమిన్స్‌ను షమీ అవుట్ చేశాడు. కోహ్లీ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాతి బంతికే దినేష్ కార్తీక్ ఆష్టన్ అగర్‌ను అవుట్ చేశాడు. ఐదో బంతికి ఇంగ్లిస్ కూడా ఔటయ్యాడు.

ఒక రకంగా ఇది జట్టు హ్యాట్రిక్‌గా నిలిచింది. ఆఖరి బంతికి షమీ రిచర్డ్‌సన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో టీమిండియా విజయాన్ని అందుకుంది.

జస్ప్రీత్ బుమ్రా గాయంతో షమీ జట్టులో చోటు సంపాదించాడు. షమీ బౌలింగ్‌ చూసి కెప్టెన్‌, కోచ్‌లు రిలీఫ్‌ అయ్యారు.

ఈ మ్యాచ్‌లో షమీ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.