టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ పెద్ద ఝలక్‌ ఇచ్చింది

ప్రీపెయిడ్‌ కస్టమర్లకు 30 రోజులు చెల్లుబాటయ్యే రీచార్జ్‌ ప్లాన్లు అందించాలని స్పష్టం

గతంలో కంపెనీలు 30 రోజులు చెల్లుబాటయ్యే రీచార్జ్‌ ప్లాన్లు అమలు చేసేవి. రెండేళ్ల నుంచి దీన్ని 28 రోజులకు కుదించాయి

ప్రీపెయిడ్‌ ఖాతాదారులు సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్‌ చేయించుకోవాల్సి వస్తోంది. దీనిపై ఫిర్యాదులతో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది

ఈ నిబంధనల ఉత్తర్వులు జారీ అయిన 60 రోజుల్లోగా టెలికాం కంపెనీలు ఈ నిర్ణయం అమలు చేయాలన్న ట్రాయ్

ఇక నుంచి 30 రోజులు చెల్లుబాటయ్యేలా  ఒక ప్లాను, ఒక స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌, ఒక కాంబో వోచర్‌ ఆఫర్‌ చేయాలని ఆదేశం