కొడుకు ఏదైనా గొప్పగా సాధిస్తే పొగుడుతామ్! పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబవుతాం!కానీ అదేంటో కీరవాణి తండ్రి మాత్రం అలా కాదు..!

టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ అండ్ స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న కీరవాణి. అనూహ్యంగా ఆస్కార్ వరకు చేరుకున్నారు.

కాని షాకింగ్‌గా.. అసలు ఇది ఒక పాటేనా? అనే కామెంట్ తన తండ్రి నోటి వెంట వచ్చేలా చేసుకున్నారు.

స్టోరీ రైటర్‌గా.. టాలీవుడ్లో తనకంటూ పేజ్‌ క్రియేట్‌ చేసుకున్న రైటర్ అండ్ కీరవాణి ఫాదర్ శివదత్త..

తాజాగా తన కొడుకు క్రియేట్ చేసిన సెన్సేషనల్ పాటపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కీరవాణి మ్యూజిక్ ట్యాలెంట్‌ గొప్పదంటూనే..

ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అసలు తనకు నచ్చలేదంటూ చెప్పారు. అంతేకాదు ఇది పాటేనా?

ఇందులో సంగీతం ఎక్కడుందంటూ సెటైర్‌ వేశారు. కీరవాణి ఇచ్చిన మ్యూజిక్‌లో ఇదొక మ్యూజికేనా అంటూ.. పెదవి విరిచారు.

విధి విచిత్ర వైచిత్రమిది అని అన్నారు. కానీ ఇన్నాళ్లూ అతడు చేసిన కృషికి ఈ రూపంలో ఫలితం వచ్చిందంటూ..

తన మాటల్లో కోట్ చేశారు. ఈ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.