సనాతన ధర్మంలో గంగా నది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గంగా నదిని తల్లిగా భావించి పూజిస్తారు.

గంగాజలాన్ని తాకడం వల్ల పాపాలు నశిస్తాయి. ప్రత్యేక సందర్భాలలో గంగా నదిలో ఖచ్చితంగా స్నానం చేస్తారు.

పూజలో గంగాజలం ఉపయోగిస్తారు. చాలా మంది హిందువుల ఇళ్లల్లో గంగాజలం లేదా ఇతర పవిత్ర నదీ జలాలు ఖచ్చితంగా ఉంటాయి.

పురాణ గ్రంధాలలో గంగా జలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఇంట్లో ఉంచాలన్నా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాలి. పాటించకపోతే అశుభ ఫలితాలు వస్తాయి.

ప్లాస్టిక్ సీసాలో ఉంచిన గంగా జలం  అశుద్ధంగా మారుతుంది. కాబట్టి ఇలా చేయకూడదు.

గంగాజలాన్ని లేదా ఏదైనా పవిత్ర జలాన్ని మురికి చేతులతో తాకకూడదు. అలా చేయడం నిందలకు దారి తీస్తుంది.

నాన్‌వెజ్‌ చేసే ఇళ్లలో గంగాజలాన్ని కూడా ఉంచకూడదు. ఇలా చేయడం పాపంగా పరిగణించబడుతుంది.

బహిష్టు సమయంలో స్త్రీలు లేదా బాలికలు గంగాజలాన్ని తాకకూడదు .

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో గంగాజలాన్ని తాకకూడదు.