రవితేజ - హరీష్‌శంకర్‌ కాంబోలో  వచ్చిన ‘మిరపకాయ్‌’ చిత్రం భారీ విజయం సంధించిన సంగతి తెలిసిందే

ఈ విజయవంతమైన కలయికలో మరో చిత్రం తెరకెక్కనుంది

ఈసారి రవితేజతో చేయనున్న చిత్రం కోసం పీరియాడిక్‌ డ్రామా కథని సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు హరీష్‌శంకర్‌

‘రావణాసుర’ విడుదలని సందర్భంగా మంగళవారం ట్విటర్‌లో అభిమానులతో రవితేజ ముచ్చటించారు

ఈ సందర్భంగా ‘మిరపకాయ్‌’ కలయికలో మళ్లీ సినిమా ఎప్పుడని ఓ ఫ్యాన్ ప్రశించారు

దీనిపై సంపాందించిన హరీష్‌శంకర్‌ అన్నయ్యతో సినిమా కోసం ఒక పీరియాడిక్‌ డ్రామా కథపై కసరత్తులు జరుగుతున్నాయి

చరిత్రని పునరావృతం చేస్తున్నామని బదులిచ్చారు.

అయితే ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి.