మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) తాజాగా బాబ్లీ బౌన్సర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానుంది

ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా పై గట్టి నమ్మకంతో ఉంది తమన్నా.

ఈ సినిమాలో లేడీ బౌన్సర్ గా కనిపించనుంది తమన్నా. ఈ సినిమాకోసం ఈ అమ్మడు చాలా కష్టపడిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నా.. ఈ సినిమాకు కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని ధీమా వ్యక్తం చేసింది

మొట్టమొదటిసారి లేడీ బౌన్సర్‌ కథతో తెరకెక్కిన సినిమా ఇది.

ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని చెప్పుకొచ్చిది.తన కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుందని..

గతంలో మదుర బండార్కర్‌ దర్శకత్వంలో చేసిన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు వచ్చాయని, ఈ సినిమాతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది అని తెలిపింది తమన్నా.