ట్రెండ్ ఫాలో అవ్వడం అప్పుడప్పుడు మన ఆరోగ్యానికి ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా కుర్రకారు వేసే స్కిన్నీ జీన్స్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాళ్లలోని కండరాలు , నరాల ఫైబర్‌లను జీన్స్ దెబ్బతీస్తుందని, తద్వారా నడవడం కష్టమవుతుందని అధ్యయనంలో తేలింది.
న్యూరాలజీ న్యూరోసర్జరీ & సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 35 ఏళ్ల మహిళ రెండు చీలమండలలో తీవ్రమైన నొప్పికి..
ఆమె ధరించే స్కిన్నీ జీన్స్ కారణమని వైద్యులు కనుగొన్నారు. టైట్ జీన్స్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అభివృద్ధికి దారితీస్తుంది. ఇది కాళ్ల కండరాలకు రక్త సరఫరాను తగ్గిస్తుంది.దీని వలన కండరాలు వాపు , నరాలు బలహీనంగా మారతాయి.
అంతేకాకుండా జననేంద్రియ వాహిక వ్యాధిపై పరిశోధన జర్నల్ లో ప్రచురించిన దాని ప్రకారం బిగుతుగా ఉండే జీన్స్ , స్కిన్నీ ప్యాంటు వల్వోడినియాకు కారణమవుతుందని కనుగొంది.
టైట్ ఫిట్టింగ్ జీన్స్ కూడా యోని చికాకు, ఈస్ట్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ వాగినోసిస్‌కు కారణమౌతుంది. జీన్స్ దిగువ శరీరంలో గాలి ప్రవాహాన్ని, రక్త ప్రవాహాన్ని పరిమితం చేయడం కారణంగా ఈ సమస్యలు కలుగుతాయి.
పురుషులలో వంధ్యత్వానికి టైట్ జీన్స్ కారణమని పరిశోధనల్లో తేలింది. స్కిన్నీ జీన్స్ ధరించడం పురుషుల్లో వారి పునరుత్పత్తి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.
ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు మూత్రపరమైన సమస్యలను కలిగిస్తుంది,అందుకే అప్పుడప్పుడు మినహా రోజువారిగా జీన్స్ ధరించటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.