శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు అంటూ కొద్ది కాలంగా తరచూ వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ ఈ విషయాన్ని ఫ్యామిలీ మాత్రం  బయటపెట్టడం లేదనే విషయం తెలుస్తోంది.

 శ్రీజ, కళ్యాణ్  దంపతులు విడాకులు తీసుకొని విడిపోవడంతో పిల్లలు శ్రీజ వద్దనే ఉంటున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

కళ్యాణ్ దేవ్ సొంత కుమార్తె నవిష్క అయినప్పటికీ నివృత్తిని కూడా సొంత కూతురుగానే భావించి తనతో మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు.

తాజాగా ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన కూతుర్లను మిస్ అవుతున్న విషయాన్ని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇన్ స్టా గ్రామ్ స్టోరీ ద్వారా ఈయన ఓ వీడియో షేర్ చేసారు. 

తన కూతుర్లను మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది.