మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి సిస్టర్ గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమానుంచి నయా పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.

నేడు( మే 1) కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమానుంచి చిరంజీవి పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.

భోళాశంకర్ సినిమాలో చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నారు.

చిరు టాక్సీ డ్రైవర్ గెటప్ లో ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు మేకర్స్. టాక్సీ తో చిరంజీవి రకరకాల ఫోజులు ఇచ్చారు.

ఈ సినిమా ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏకే ఎంటర్టైనమెట్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.