మెగాస్టార్ చిరంజీవి.. సినీపరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు స్పూర్తి. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో సినీరంగంలోకి నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. ఇవాళ మెగాస్టార్గా తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.
ప్రస్తుతం ఆయన భోళా శంకర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే చిరుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో తెగ వైరలవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి తొలి నాళ్లల్లో వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సందడి చేశారు. అంటే రియాల్టీ షో.. టాక్ షోలలో కనిపించడం కాదు..
ఏకంగా ఓ సీరియల్లో నటించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు.
మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనవరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు.
అదే సమయంలో ‘రజిని’ అనే హిందీ సీరియల్లోనూ నటించారు చిరు. ఆ సీరియల్లో కేవలం అతిథి పాత్రలో కనిపించారు చిరు.
ఆ తర్వాత కూడా ఆయన పాత్ర ఉన్నప్పటికీ సినిమా అవకాశం రావడంతో సీరియల్ నుంచి తప్పుకున్నారట చిరు.
ఇక ఆ తర్వాత సినీరంగంలో ఆయన క్రేజ్ మారిపోయింది.