రామ్ చరణ్ అమెరికాలో ఉంటూ పలు అవార్డుల కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నారు.
దర్శకధీరుడు రాజమౌళితో కలిసి అంతర్జాతీయ వేదికలపై మెరిశారు.
అయితే తాజాగా అమెరికా పర్యటనలో చెర్రీ ధరించిన సూట్స్‌పై నెట్టింట చర్చ మొదలైంది.
చెర్రీ ధరించిన షూట్స్ ఎక్కడ తయారు చేశారు? వాటి డిజైనర్ ఎవరు? వాటి ధర ఎంత? అన్న విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
చెర్రీ ధరించిన షూట్స్ ఎక్కడ తయారు చేశారు? వాటి డిజైనర్ ఎవరు? వాటి ధర ఎంత? అన్న విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
తాజా అప్ డేట్ ప్రకారం రామ్ చరణ్ వేసుకున్న సూట్స్ చెన్నైకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం.
మెగా హీరో ధరించిన ఒక్కో సూట్ కోసం దాదాపు రూ.13 నుంచి రూ.70 లక్షల వరకు వెచ్చించారని తెలుస్తోంది.
అంతర్జాతీయ వేదికలపై రామ్ చరణ్ ధరించిన సూట్స్ రాయల్ లుక్‌లో కనిపించాయి. అమెరికాలో చెర్రీ రాయల్‌గా కనిపించడంపై మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.