ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.
ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన మీనాక్షికి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తుంది.
ఈ విషయం పై స్పందిస్తూ.. అయితే ఎలాంటి పాత్ర కోసం తనను ఎవరూ సంప్రదించలేదని మీనాక్షి చౌదరి స్పష్టం చేసింది.
సలార్‌లో చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంకా అది ఖరారు కాలేదు.
హిట్ 2 చేశాను. తమిళంలో విజయ్ ఆంథోని నటించిన `కొలై`లో నటించాను. అవి త్వరలో విడుదలకాబోతున్నాయి.