మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు దేవుడు ప్రసాధించిన గొప్ప సంపద
ప్రకృతిలో లభించే మొక్కలు, పండ్లు, పూలు అన్నింటిలోనూ మనకు కావాల్సిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి
అలాంటి వాటిల్లో ఒకటి మునగా కూడా. మునగ ఆకుల్లో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి
ఆయుర్వేదంలో ఈ ఆకులను అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు
బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ కలుపుకుని తాగితే మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతాయి
ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుతూ ఉంటే క్రమంగా రేచీకటి తగ్గుముఖం పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది
మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలు, బెణుకు నొప్పుల పైన వేసి కట్టుకడితే నొప్పుల బాధలు తగ్గిపోతాయ్
మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు తగ్గి,ముఖచర్మం మృదువుగా మారుతుంది