రోడ్ల వెంట వెళ్తున్నప్పుడు రహదారులపై తెల్లటి, పసుపు రంగు, నల్లటి రంగు లాంటి గీతలు చూస్తుంటాము

వాహనదారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, గుర్తులనే కాకుండా రహదారిపై ఉండే గీతల గురించి కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం

రోడ్లపై తెలుపు, పసుపు రంగుల్లో గీతలను చూసి ఉంటారు. అసలు ఆ గీతలు ఎందుకుంటాయి..? వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం

రోడ్డుపై తెలుపు రంగు కంటిన్యూగా ఒకటే ఉంటే వాహనదారులు తమకు కేటాయించిన లైన్‌లోనే వెళ్లాలని అర్థం

అక్కడక్కడ మధ్యలో బ్రేకులతో కూడిన తెలుపు రంగు గీత ఉంటే..వాహనదారులు లైన్‌ ఛేంజ్‌ కావచ్చని అర్థం

రోడ్డుపై పసుపు రంగు గీత నీటారుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాహనదారులు ఓవర్‌టెక్‌ చేయవద్దని అర్థం

రెండు పసుపు రంగు గీతలుంటే..: రహదారిపై దృఢమైన పసుపు రంగు రెండు గీతలుంటే ఓవర్‌టెకింగ్‌కు నిషేధమని అర్థం

రోడ్డుపై రెండు పసుపు గీతలు ఉండి, అందులో ఒక వైపు కంటిన్యూగా గీత వచ్చి, మరో వైపు మధ్య మధ్యలో బేక్‌ ఇస్తూ గీత ఉంటే గీత వైపు ఓవర్‌టెక్‌ చేయకూడదని, బ్రేక్స్‌ వచ్చిన గీత వైపు ఓవర్‌ టెక్‌ చేయవచ్చని అర్థం