చాలా కార్లకు తెలుపు, పసుపు రంగులో నంబర్ ప్లేట్‌లను కలిగి ఉండటం చూసే ఉంటారు

వీటితో పాటు.. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లోనూ నంబర్ ప్లేట్స్ ఉంటాయి

వాస్తవానికి కారు నంబర్ ప్లేట్ దాని రిజిస్ట్రేషన్ ఆధారంగా నిర్ణయించబడుతుంది

ఇవాళ మనం ఎరుపు, ఆకుపచ్చ, బ్లూ, బ్లాక్ నంబర్ ప్లేట్స్‌కు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

గవర్నర్, రాష్ట్రపతి వాహనాలకు ఎరుపు రంగు నంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్‌లో జాతీయ చిహ్నం అశోక స్తంభాన్ని అమర్చుతారు

ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్‌కు ఆకుపచ్చ నంబర్ ప్లేట్‌లపై తెలుపు రంగులో నంబర్లు రాస్తారు

అద్దెకు తీసుకునే కార్లపై బ్లాక్ నంబర్ ప్లేట్ అమర్చుతారు

ఎంబసీకి చెందిన వాహనాలకు మాత్రమే బ్లూ కలర్ నంబర్ ప్లేట్లు అతికిస్తారు. విదేశీ ప్రతినిధులు ఈ బ్లూ నంబర్ ప్లేట్ కార్లలో ప్రయాణిస్తారు