తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రవితేజ పెళ్లి గురించి..
రవితేజకి పెళ్లి ఇష్టం లేకుండానే ఆయన తల్లి పెళ్లి చేసింది అంటూ ఒక వార్త వినిపిస్తోంది.
రవితేజ పెళ్లి చేసుకున్న కళ్యాణి ఎవరో కాదు స్వయానా రవితేజ తల్లి రాజ్యలక్ష్మి సోదరుడి కూతురు అంటే రవితేజ మేనమామ కూతురు అన్నమాట.
అయితే ఇండస్ట్రీలో రవితేజ హీరోగా మంచి పొజిషన్ కి వచ్చాక ఒకవేళ రవితేజ ఎక్కడ హీరోయిన్లతో లవ్ లో పడి పెళ్లి చేసుకుంటాడో..
బయటి నుంచి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో అని ముందుగానే భావించిన రవితేజ తల్లి రాజ్యలక్ష్మి..
రవితేజకు అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ముందే తన మేనకోడలు కళ్యాణి ఇచ్చి పెళ్లి చేసింది.
ఇక రవితేజను ఈ పెళ్లికి ఒప్పించడానికి రాజ్యలక్ష్మి చాలానే చేసిందట. ఎందుకంటే రవితేజ కు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట.
ఇంకొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో ఎదిగాక చేసుకుందాం అనుకున్నారట.కానీ రాజ్యలక్ష్మి మాత్రం రవితేజను ఒప్పించి కళ్యాణి ని పెళ్లి చేసింది.
ఇక పెళ్లయ్యాక కళ్యాణి సినీ ఇండస్ట్రీకి చాలా వరకు దూరంగా ఉండి ఇంటిపట్టునే ఉంటూ రవితేజ పనుల్లో చేదోడువాదోడుగా ఉంది.