చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో ప్రేక్షకులను వణికించి, థ్రిల్ కి గురిచేసిన సినిమా ‘మసూద‘.
సూపర్ నేచురల్ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ సీరియస్ మోడ్ లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది.
చూసే ప్రేక్షకుల్లో కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే ఆసక్తిని క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేసింది.
థియేటర్స్ లో సినిమా చూసిన ఆడియెన్స్ కి మాత్రం రెండున్నర గంటలపాటు అల్లాడించేసిందని చెప్పవచ్చు.
రెండో రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన మసూద మూవీ.. సుమారు రూ. 4 కోట్లకు పైగా లాభాలను రాబట్టుకుంది.
ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనిపించుకుంది.
బ్లాక్ బస్టర్ మసూద మూవీ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది.
తెలుగు ఓటిటి ‘ఆహా‘ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నారట.
డిసెంబర్ 16 లేదా 23 నుంచి గానీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.