రావు రమేష్ ప్రధాన పాత్రధారిగా పీబీఆర్ సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’
లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు
శుక్రవారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించాయి చిత్రవర్గాలు
ఈ నేపథ్యంలో ‘‘నడి వయసులో ఉన్న ఓ మధ్య తరగతి నిరుద్యోగి కథ ఇది
జీవితంలో అడుగడుగునా చోటు చేసుకునే సంఘటనలు, మలుపులతో రెండు గంటలపాటు కడుపుబ్బా నవ్విస్తుంది
రావు రమేష్‌కి తగిన కథ ఇది. ఆయన ప్రధాన పాత్ర చేయడానికి ఒప్పుకోవడమే మా సినిమా విజయానికి సంకేతం
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెడతాం
త్వరలోనే ఇతర నటులు, సాంకేతిక బృందం వివరాల్ని వెల్లడిస్తామ’’ని చిత్ర డైరెక్టర్ లక్ష్మణ్ కార్య పేర్కొన్నారు