మారేడుమిల్లి అడివి ప్రాంతం పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, స్వఛ్చమైన గాలి, కనులకు కనువిందు చేసే అందాలతో పర్యాటకులని ఆకర్షించే ప్రాంతం

 రాజమండ్రి నుండి సుమారు 80 కి.మీ దూరంలో ఉన్న మారేడుమిల్లికి వెళ్లలంటే ఘాట్ రోడ్లపై ప్రయాణం..అనేక మలుపులతో ధ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే డ్రైవింగ్‌లో ఎక్స్‌పర్ట్స్ అయి ఉండాలి

  శీతాకాలంలో పర్యటనకు అనుకూలం. సముద్రమట్టానికి సుమారు" 2 వేల " అడుగుల ఎత్తులో ఉన్న మారేడుమిల్లిలో కాఫీ  రుబ్బరు తోటల సహా ఎత్తైన వృక్షాలు మొదళ్ళనుంచు పైదాకా ఎగబ్రాకిన మిరియాల పాదులతో మనోహరం

 ఆంధ్రా ఊటీగా ప్రసిద్ది మారేడుమిల్లి. ఒంపు సొంపుల నల్లనితాచు లాంటి తారురోడ్డు దారికి ఇరువైపులా వెదురువనం.. కనుచూపు మేర పచ్చని చీర కట్టుకున్నట్లు ప్రకృతి అందాలు

  మారేడుమిల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు, జలపాతాలు కనిపిస్తాయి. కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలు పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి.

 మారేడుమిల్లి స్పెషల్ బేంబో చికెన్. ఆయిల్ లేకుండా తయారు వెదురు గెడ బొంగులో చికెన్ వేసి మంటలో కాల్చి చేసే వంటకం

 సరదాగా టూర్‌కు తక్కువ ఖర్చుతో వెళ్లదాం అనుకునే వారికి ది బెస్ట్ ప్లేస్.. తూర్పుగోదారి జిల్లాల్లోని మారేడుమిల్లి