అల్లం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది
దాల్చిన చెక్కలో గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి
జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇది గ్యాస్ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది
ధనియాలు శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. కడుపులో అధిక వేడి కారణంగా యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడేవారికి ఇది చాలా మంచిది
ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఇందులోని గుణాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి
పసుపును రోగనిరోధక శక్తిని పెంచడంలో కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది
యాలకులను మౌత్ ఫ్రెషనర్‌గా వాడుతారు. ఆయుర్వేదం ప్రకారం, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది