‘‘బాబా’ సినిమా పరాజయంతో సౌత్‌లో నాకు అవకాశాలు తగ్గాయి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనీషా కొయిరాల తెలిపారు
సురేష్‌కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్, మనీషా జంటగా నటించిన చిత్రం ‘బాబా’
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మనీషా మాట్లాడుతూ – ‘‘తమిళంలో నేను చేసిన చివరి పెద్ద సినిమా ‘బాబా’నే.
ఈ సినిమా విజయంపై భారీ అంచనాలు ఉండేవి. అయితే ఘోర పరాజయాన్ని చవి చూసింది.
ఈ సినిమా ఫ్లాప్‌తో సౌత్‌లో నా కెరీర్ అయిపోతుందనుకున్నాను. అదే జరిగింది.
‘బాబా’కన్నా ముందు సౌత్‌లో చాలా సినిమాలు చేశాను. అయితే ఈ సినిమా పరాజయం వల్ల అవకాశాలు తగ్గాయి.
అయితే ‘బాబా’ని డిసెంబర్ 12 రజనీ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 10న రీ రిలీజ్ చేస్తే, హిట్ కావడం ఆశ్చర్యం అనిపించింది.
ఏది ఏమైనా రజనీ సార్‌తో సినిమా చేయడం హ్యాపీ’’ అని తెలిపారు మనీషా కొయిరాల