మనోజ్‌ గత నెలలో మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో జరిగింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటంతో రామ్‌చరణ్‌ దంపతులు ఈ వేడుకకు హాజరు కాలేదు. 

ఈ క్రమంలోనే నూతన జంటకు అభినందనలు తెలుపుతూ ఈ జోడీ స్పెషల్‌ గిఫ్ట్‌ను పంపించింది.

రామ్‌చరణ్‌ ఆయన సతీమణి ఉపాసనను ఉద్దేశిస్తూ నటుడు మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు.

తనకు విలువైన బహుమతిని పంపించిన వాళ్లిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. 

త్వరలోనే వాళ్లను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. 

చెర్రీ దంపతులు పంపిన గిఫ్ట్‌ ఫొటోలను సైతం ఆయన నెట్టింట్లో పోస్ట్‌ చేశారు.