మంచు మనోజ్ రెండో పెళ్లి అనేది నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేలా తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మంచు మనోజ్.

'పెళ్లి కూతురు' అని పేర్కొంటూ భూమా మౌనిక రెడ్డి పిక్ పంచుకున్నారు మంచు మనోజ్.

దీనిపై #ManojWedsMounika, #MWedsM హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. అంతేకాదు తాము లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు అందరికీ తెలిసేలా లవ్ సింబల్స్ జోడిస్తూ ఈ పోస్ట్ పెట్టారు.

మంచు మనోజ్ పెళ్లి సంబరాలు షురూ అయ్యాయని తెలియడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇదిలా ఉంటె మనోజ్ పెళ్లిపై పలు రకాల రూమర్స్ గట్టిగానే వినిపించాయి.

భూమా మౌనిక ను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపి అన్నిటికి పులుస్టాప్ పెట్టేసాడు మంచు మనోజ్.