మాళవిక మోహనన్ గురించి మనందరికీ తెలిసిందే.మాళవిక మోహన్ తక్కువ సినిమాలలో నటించినప్పటికీ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
తరచూ ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.
మొన్నటి వరకు ఈమె ప్రభాస్ తో సినిమా చేయబోతోంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే గత రెండు మూడు రోజులుగా మాళవిక మోహనన్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆ విషయంపై తాజాగా రియాక్ట్ అయ్యింది మాళవిక మోహనన్.
సందర్భంగా ఆమె ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, అందులో నిజం లేదని తెలిపింది.
పవన్ కళ్యాణ్ తో నటించాలని తనకు ఉందని, కానీ ఈ వార్త వాస్తవం కాదని ఆమె తెలిపింది.
పవన్ కళ్యాణ్ సర్‌పై చాలా అభిమానం ఉంది. కానీ నేను ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం లేదు. ప్రస్తుతం ఒక అద్భుతమైన తెలుగు సినిమాలో నటిస్తున్నాను తెలిపింది