ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే టేస్టీ టేస్టీ టమాటా సూప్ తయారు చేయడం ఎలా చూద్దాం

కావ‌ల్సిన ప‌దార్థాలు : టమాటాలు- 8, మిరియాల పొడి ఒక టీ స్పూన్, కారం- ఒక టీ స్పూన్,  జీలకర్ర పొడి ఒక టీ,  స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్,  నీళ్లు – 4 క‌ప్పులు, ఉప్పు – రుచికి తగినంత

ముందుగా ప్రెష్ గా ఉన్న టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి రెండు విజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి

చల్లారిన అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

టమాటా ప్యూరీలో నాలుగు కప్పుల నీటిని కలిపి స్ట‌వ్‌ మీద పెట్టాలి

అది బాగా మారుగుతున్న సమయంలో మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి

అనంతరం సిమ్ లో పెట్టి.. మరికొంచెం సేపు మరిగించాలి

తర్వాత స్టౌ మీద నుంచి దింపి.. దానిలో పుదీనా వేసుకుని వేడివేడిగా బ్రేక్ ఫస్ట్ తో పాటు ఒక కప్ టమాటా సూప్ సేవిస్తే.. మంచిది