కావలసిన పదార్ధాలు ఉడికించిన గుడ్లు, కరివేపాకు, లవంగాలు, పెద్ద ఎర్ర ఉల్లిపాయలు, బే ఆకులు, ఏలకులు, టొమాటోలు, ఉప్పు-2 స్పూన్ పసుపు, జీలకర్ర, సోపు గింజలు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం పేస్ట్, కొత్తిమీర, నూనె

కరివేపాకు, లవంగాలు, బే ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క , జీలకర్ర గింజలను నూనెలో వేసి మీడియం ప్లేమ్ మీద వేయించండి

తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసి మంచి సువాసన వచ్చే వరకు సుమారు 1 నిమిషం వేయించాలి

స్టౌ మంట స్విమ్ లో పెట్టి.. నెక్స్ట్ఉల్లిపాయలు, ఉప్పు , పసుపు వేసి..  15-20 నిమిషాలు ఉడికించాలి

ఉల్లిపాయలు బ్రౌన్  కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఇలా ఉల్లిపాయలు వేయిస్తున్న సమయంలోనే సోంపు గింజలు, మిరియాలను పౌడర్ పట్టుకోండి

ఉల్లిపాయల మిశ్రమంలో ఉడికించిన గుడ్లు వేసి.. లేత గోధుమరంగు లోకి గుడ్లు వచ్చేవరకూ 2-3 నిమిషాలు వేయించాలి

నెక్స్ట్ టమాటా ముక్కలు వేసి.. నీరు ఆవిరి అయ్యేవరకూ ఉడికించుకోవాలి. చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసి.. కొంచెం సేపు ఉడికించుకోవాలి

చివరిగా సోంపు, మిరియాల పౌడరు వేసుకుని ఉప్పు సరిపడేలా వేసుకుంటే.. కేరళ స్పెషల్ గుడ్డు కర్రీ రెడీ