20 నుంచి 30 ఉసిరికాయలను కడిగి ఫోర్క్‌తో గాట్లు పెట్టాలి. ఆ తర్వాత కొంచె పటికను వేసి రాత్రంతా నీటిలో నానబెట్టండి
ఇది ఉసిరి చేదును తొలగించడంలో సహాయపడుతుంది. మరుసటి రోజు ఉదయం పాన్‌లో తగినంత నీరు మరిగించి దానిలో ఉసిరికాయ వేయండి
అవి పూర్తిగా మరిగాయో లేదో నిర్ధారించుకోవాలి. 20 నిమిషాలు ఉడకబెట్టి తర్వాత వడకట్టి ఉసిరికాయలను పక్కన పెట్టాలి
దీని తరువాత 4 కప్పుల నీటిలో చక్కెరను వేసి కరిగించాలి
దానిలో ఉడకబెట్టిన ఉసిరిగాయలను వేసి చిన్న మంట మీద సుమారు 45 నిమిషాలు లేదా ఉసిరి స్పాంజిగా మెత్తబడే వరకు ఉడికించాలి
ఆ తరువాత మిశ్రమాన్ని చల్లబర్చి మూతపెట్టి కనీసం 48 గంటలు పొడి ప్రదేశంలో ఉంచండి
దీని తరువాత ఈ మిశ్రమాన్ని మరోసారి ఉడకబెట్టి.. దానిలో కొంచెం కుంకుమపువ్వు, 2 టీస్పూన్ల యాలకుల పొడిని జోడించాలి
ఆ తరువాత చల్లారిస్తే.. మీ ఇంట్లో ఆరోగ్యకరమైన ఆమ్లా మురబ్బా సిద్ధంగా ఉన్నట్లే
వాటిని శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేస్తే 12 నెలల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది