రాగి లడ్డు తయారీకి కావాల్సిన పదార్ధాలు రాగి పిండి, నెయ్యి, బెల్లం, పచ్చి కొబ్బరి, నువ్వులు, వేరుశనగలు,బాదం పప్పు, జీడిపప్పు, యాలకుల పొడి 

ముందుగా స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. నూనె నెయ్యి లేకుండా స్విమ్ మీద నువ్వులు, వేరుశనగలు, తురిమిన కొబ్బరిను వేరు వేరుగా వేయించుకోవాలి

చల్లారిన తర్వాత వేరుశనగల పై పొత్తు తీసివేయాలి

తర్వాత బాణలి లో నెయ్యి వేసుకుని బాదాం, జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి

తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని రాగి పిండి ని కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించుకోవాలి

తర్వాత అందులో వేయించిన బాదంపప్పు, పల్లీలు, కొబ్బరి , నువ్వులు వేసి కలుపుతూ ఉండాలి

తర్వాత బెల్లం, యాలకుల పొడిని వేసుకుని మరికొంచెం సేపు కలుపుకుని స్టౌ ఆపేయాలి

తర్వాత ఈ రాగిపిండి మిశ్రమం చల్లారనివ్వాలి. ఆ పిండిలో నెయ్యి వేసుకుని చేతికి నెయ్యి రాసుకుని లడ్డుల్లా చుట్టుకోవాలి