బెల్లం-వేరు శెనగ చిక్కీ కోసం కావలసినవి 250 గ్రాముల పొట్టు తీసిన వేరుశెనగ, 200 గ్రాముల బెల్లం, అర కప్పు నీరు, తగినంత వెన్న అవసరం

పల్లి పట్టీ(బెల్లం-వేరు శెనగ చిక్కీ) తయారు చేయడానికి ముందుగా పాన్ వేడి చేయాలి. ఆ తరువాత వేరుశెనగలను బాగా వేయించాలి

తద్వారా అవి క్రిస్పీగా మారుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు నీళ్లు పోసి బెల్లం వేసి గ్యాస్‌పై ఉడికించాలి

బెల్లం పాకంలో వేరుశెనగ వేసి బాగా కలపాలి. ఆ తరువాత నెయ్యి, వెన్నతో మిక్స్ చేసి.. కావాల్సిన ఆకృతిలో మార్చుకోవాలి

కావాలనుకుంటే.. డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఇంకేముంది బెల్లం చిక్కీ రెడీ

ఈ చిక్కీలను భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు తినొచ్చు

దీన్ని రోజూ తినడం వల్ల శరీరంలో రక్త హీనత తగ్గుతుంది

శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి దోహదపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది