మార్కెట్‌లో దొరికే ఫేస్‌ స్క్రబ్‌లు చర్మానికి హాని కలిగిస్తాయి

ఇంట్లో దొరికే పదార్ధాలతో తయారు చేసిన స్క్రబ్‌లతో అందం, ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు

కాఫీ - పంచదార.. ఈ రెండు పదార్ధాలు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరచి, మంచి పోషణను అందించే లక్షణాలు కలిగి ఉంటుంది

పంచదార గ్రైండ్ చేసి అందులో కాఫీ పొడి కలిపి కాసేపు అలాగే ఉంచాలి

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కొద్ది సమయం తర్వాత గోరువెచ్చని నీటితో కడగేస్తే సరి

ఓట్స్ - పంచదార.. జిడ్డు చర్మం కలిగిన వారికి ఉంటే ఈ రెండు పదార్ధాలతో తయారు చేసిన స్క్రబ్ బాగా పనిచేస్తుంది

ఓట్స్-షుగర్ స్క్రబ్‌లో తేనె, రోజ్ వాటర్‌లను కూడా జోడించవచ్చు

ఓట్స్ చర్మాన్ని శుభ్రపరిస్తే, తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది