మునగాకు సూప్ కావ‌ల్సిన ప‌దార్థాలు మున‌గ ఆకులు, చిన్న ఉల్లిపాయ‌లు, ట‌మాటా, జీల‌క‌ర్ర, వెల్లుల్లిరేకలు, నీళ్లు, ఉప్పు, నూనె

మున‌గాకులను శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టాలి

తర్వాత స్టౌ పై బాండి పెట్టుకుని నూనె వేసి.. వేడి చేయాలి.. నూనె వేడెక్కాక జీల‌కర్ర వేసి కొద్దిగా వేయించాలి

అందులో వెల్లుల్లి రెబ్బ‌ల‌ను బాగా న‌లిపి వేసుకోవాలి

త‌రువాత కొంత సేపు వేయించి అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ‌లు, ఉప్పు వేసుకుని వేయించాలి

ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్నగా తరిగిన టమాటా ముక్కలను వేయాలి

టమాటా బాగా వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న మునగాకులను వేసుకుని కొంత సేపు వేయించుకోవాలి

కమ్మగా వేగిన తర్వాత అందులో నీరు పోసుకోవాలి. 10 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి

ఉప్పు చూసుకుని అవసరం అయితే మరికొంచెం ఉప్పు వేసుకోవాలి

దింపే ముందు కొంచెం మిరియాల పొడి చల్లుకుని స్టౌ మీద నుంచి దింపేస్తే మునగాకు సూప్ రెడీ. వేడి వేడిగా తాగితే రుచి, ఆరోగ్యం